ఫ్లాష్ …ఫ్లాష్ …అదుపుతప్పి చెరువులో పడిపోయిన జగిత్యాల మున్సిపల్ చైర్మన్
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారికి ప్రమాదం తప్పింది.ఈరోజు జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అక్కడే చెరువులో తెప్ప పైన నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న వినాయకుడి విగ్రహానికి పూజలు చేశారు.ఒకేసారి ఎక్కువ మంది జనాలు తెప్ప పైకి ఎక్కడం వలన ఆ తెప్ప ఒకవైపుకి ఒరిగిపోవటంతో బోగ శ్రావణితో పాటు మరికొంతమంది చెరువు నీటిలో జారి పడిపోయారు.అక్కడే ఉన్న మరికొంతమంది ప్రజలు భోగ శ్రావణితో పాటు మిగతా వారిని మరో తెప్ప పైకి లాగారు.వారు నీటిలో పడిన చోట లోతు ఎక్కువగా లేకపోవటం వలన పెద్ద ప్రమాదం తప్పింది.