Jagtial NewsJagtial Politics

కళలను, కళా కారులను ప్రోత్సాహించిన ఘనత తెలంగాణ కే దక్కింది : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల:కళలను,కళాకారులను, సాహితీవేత్తలను ప్రోత్సాహించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు దక్కింది అని జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బాలు యాదిలో కళాశ్రీ స్వర నీరాజనం కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ జానపద గాయకురాలు గోట్టే కనుకవ్వకు బాలు పురస్కరాం ప్రదానం చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమానికి ప్రజలు విచ్చేసి కళా కారులను అభినందించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవారంగాలలో విశేష సేవలను అందించిన ప్రముఖులకు తెలంగాణ కీర్తి సేవా పురస్కారాలు కలవని అలాగే చిన్నారులచే సంగీత విభావరి ప్రేక్షకులను అలరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, న్యాయవాది భూసారపు శ్రీనివాస్ గౌడ్, ఉపాద్యాయ సంఘము నాయకుడు బోనగిరి దేవయ్య, కౌన్సిలర్లు ముస్కు నారాయణరెడ్డి, కూతురు రాజేశ్, కోరే గంగమల్లు, బాలే శంకర్, డిష్ జగన్, ఎల్. వేంకటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *