మెట్ పల్లి: మెటపల్లి పట్టణంలోని గోదావరి అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సోమవారం మెట్ పల్లి పట్టణానికి చెందిన పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. వోడ్డాటి వేణుగోపాల్, కోలు రావి, పుప్పాల నవీన్ కుమార్, అనగందుల రాజేంద్ర ప్రసాద్, దురిశెట్టి నవీన్ లను శాలువా మెమొంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ జోగ .నవీన్ సిబ్బంది ,అన్నపూర్ణ, తిరుపతి, ప్రదీప్ ,గణేష్ ,రసూల్ ఉన్నారు.