జగిత్యాల: రాష్ట్రంలోని గీత కార్మికులను ఆదుకునేందుకు దళిత బందు తరహాలోనే గీత కార్మిక బందు అమలు చేయాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపునూరి మల్లేశం గౌడ్ కోరారు.గురువారం జగిత్యాల పట్టణంలోని శివ సాయి హోటల్ లో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గుడాల రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ జీఓ 350 ప్రకారం 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీతా కార్మికునికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై పడి మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.
దళిత బందు మాదిరిగా రాష్ట్రంలో గీత కార్మిక బంధు అమలు చేయాలని కోరారు. గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్టుషాపుల వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వెంటనే బెల్టుషాపులను మూయించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గీతా కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రతి జిల్లాలలో నీరా కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకున్న సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంపూనూరి మల్లేశం. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా సత్యనారాయణ.అధికార ప్రతినిధి గా గుడాల రాజేష్ గౌడ్,సలహా దారులుగా సారయ్య,పరుశరాం,తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు.జిల్లా అధ్యక్షులుగా రంగు రమాగౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాగుల శ్రీనివాస్ గౌడ్,జిల్లా కార్యదర్శి గా కట్ట నర్సాగౌడ్,ఉపాధ్యక్షుడుగా చంద్రశేఖర్ గౌడ్ కార్యదర్శిగా నర్సాగౌడ్ తదితరులను ఎన్నుకున్నారు.