జగిత్యాల స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా గంగాధర్
ప్రధాన కార్యదర్శిగా రవికుమార్
జగిత్యాల, ఆగస్టు 30:
జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘo ఎన్నికల్లో అధ్యక్షులుగా తోగిటి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి రవికుమార్ లు ఎన్నికయ్యారు.
జిల్లా కేంద్రంలోని పురానీపేటలో గల సంఘం భవనంలో కార్యవర్గం ఎన్నికలు హారహోరిగా జరిగాయి. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి గెలుపొందిన వారిని ప్రకటించారు. అధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తోగిటి గంగాధర్ ఎన్నిక కాగా రెండోసారి అత్యధిక మెజార్టీతో ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి రవికుమార్ ఎన్నికయ్యారు.
కోశాధికారి తుమ్మలపల్లి సంతోష్ తోపాటు మిగతా కార్యవర్గం, సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్యవర్గం జగిత్యాలలో సంఘం సభ్యులను కలవడంతో పాటు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.మంచి మెజారిటీతో గెలిపించి మాపై పెద్ద బాధ్యతలు అప్పాజెప్పినందుకు గంగాధర్, రవికుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యవర్గాన్ని పలువురు అభనందించారు.