జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 24 మంది కోసం ఉచిత కంటి శస్త్ర చికిత్సల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తన ఆసుపత్రిలో గత 28 ఏళ్ల నుండి ఉచిత ఆపరేషన్ లు చేస్తున్నామని, ఇలాంటి అవకాశం ఇచ్చిన నాయకులకు, పేషెంట్ బంధువులకు కృతజ్ఞతలు అని అన్నారు. కన్ను చాలా సున్నితమైన అవయవం అని ఆసుపత్రి సిబ్బంది చెప్పిన జాగ్రత్తలు పాటించడం ద్వారా చికిత్సలు విజయవంతం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల టౌన్ సిఐ కిషోర్, నాయకులు భోగ ప్రవీణ్, అంబారి పేట్ సర్పంచ్ గంగాధర్, నాయకులు మల్లేష్ , శ్రీనివాస్, లక్ష్మన్ తదితరులతో పేసేంట్ బంధువులు పాల్గొన్నారు.