Jagtial NewsJagtial Politics

కేసీఆర్ ను ఇంటికి పంపెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:మాజీ చైర్మన్ గిరి నాగభూషణం

కుటుంబ పాలనతో రాష్ట్రం అప్పులపాలు

ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

డిటిఎఫ్ ధర్నాలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం డిమాండ్

జగిత్యాల, ఆగస్టు 24:

రాజ్యాంగం కల్పించిన ఉచిత విద్య, వైద్య రంగాలతో పాటు అన్నిరంగాలను నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను త్వరలోనే ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం జోస్యం చెప్పారు.
ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్నం రాంరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నాలో ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తో కలిసి నాగభూషణం పాల్గొన్నారు.
ఈసందర్బంగా నాగభూషణం మాట్లాడుతూ ఉద్యమ సమయంలో నేను నాభార్య తప్పా ఎవరూలేరని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే కొడుకులు , కూతురు, అల్లళ్లను తీసుకొచ్చి కుటుంబాపాలన సాగిస్తు, నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కుటుంబాపాలనతో రాష్ట్రం అప్పులపాలు అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా వస్తే ప్రాజెక్ట్ పేరిట దోచుకున్న సొమ్ము బయటపడుతుందని అందుకు ఆదిశలో ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు.
ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికకోసం దళిత బంధు పథకాన్ని తెరమీదికి తీసుకువచ్చిన నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని దళితులందరికి పథకాన్ని వర్తింపజేయాలనీ నాగభూషణం డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ చేపట్టి, రేషనైలజేషన్ ప్రక్రియను నిలుపదల చేయాలని డిమాండ్ చేస్తూ, టీచర్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
చుక్క గంగా రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల సాధనకోసం మరొక్కసారి తెగించి కొట్లాడాల్సిన అవసరముందన్నారు.

ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం: డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్నం రాంరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తుందని డెమాక్రెటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎన్నం రాంరెడ్డిలు వాపోయారు.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
విద్యావ్యవస్థలో కింది స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంచార్జిల పాలన కొనసాగడంవల్ల విద్య రంగం నిర్వీర్యం అయిపోయిందాన్నారు.
రేషనలైజేషన్ పేరిట పాఠశాలల్లో పోస్టులను కుదించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, పదోన్నతులు కల్పించాలని, పిఆర్సీబకాయిలు ఉద్యోగులకు తక్షణమే సమాన వాయిదాల్లో చెల్లించాలని లేనట్లయితే జిపిఎఫ్ లో జామచేయాలనీ డిమాండ్ చేశారు.
ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని,
ప్రభుత్వం తీసుకచ్చిన 25 జిఓ ను రద్దుచేయాలని, పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని చంద్ర మౌళి, రాంరెడ్డి లు ప్రభుత్వానికి సూచించారు. ఖాళీలను భర్తీ చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు నైరాష్యంలో ఉన్నారని పేర్కొంటూ ఎన్నికల మీద ఉన్న ప్రేమ విద్య రంగంపై లేదని ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించకపోతో సెప్టెంబర్ 18 న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడుతామని, ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవికి నాయకులు వినతిపత్రం అందజేశారు.
ధర్నాలో డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఏనుగు మల్లారెడ్డి, టిపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్, టిఎస్ యుటి ఎఫ్ పక్షాన భూమేష్, డిటిఎఫ్ నాయకులు నరేందర్, రాజమౌళి,సతీష్ బాబు, వీరన్న, చంద్రయ్య, శశిధర్, లింగయ్య, గంగరాజాం తదితరులు పాల్గొన్నారు.