యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి :డిఎస్పీ ప్రకాష్
జగిత్యాల, సెప్టెంబర్ 1:
మానవమనుగడ ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉందని యువత ఆదిశలో అడుగులు వేయాలని జగిత్యాల డిఎస్పీ రత్నపురం ప్రకాష్ అన్నారు.జగిత్యాల పట్టణంలో ప్రసిద్దిగాంచిన శ్రీలోకమాత పోచమ్మతల్లి ఆలయ 59 వార్షికోస్తవాన్ని పురస్కరించుకొని ఈనెల 4 నుంచి 7 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.వార్షికోత్సవానికి సంబందించిన వాల్ పోస్టరును జగిత్యాల పట్టణ సీఐ కోరే కిషోర్, నిర్వాహకులతో కలిసి డిఎస్పీ ప్రకాష్ ఆవిష్కరించారు.
ఈసందర్బంగా ప్రకాష్ మాట్లాడుతూ భక్తిభావం పెంపోందించుకునేందుకు ఆలయాల సందర్శన చేయాలని సూచించారు.కోరినకోర్కెలు తీర్చే తల్లిగా శ్రీలోకమాత దేవాలయానికి పేరుందని ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించడం అనవయితీగా వస్తుందని తెలిపారు.సమస్త మానవాళికి శుభం కలిగేవిధంగా అమ్మవారు అనుగ్రహించాలని, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనాను అంతమోందించాలని డిఎస్పీ ప్రకాష్ పోచమ్మతల్లిని వేడుకున్నారు.
కార్యక్రమంలో గాజుల రాజేందర్, గాజోజు గోపాలాచారి, అంగడిమఠం సాధశివ్, రాఘవాచారి, సుగుణకర్, విద్యాసాగర్, భోగ శ్రీనివాస్, తోగిటి మధుసూదన్, కొమురవెల్లి లక్ష్మి నారాయణ,వడ్లురి హరి తదితరులు పాల్గొన్నారు.