జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలుగా మాదాసు మధురమ్మ ను నియమించినట్లు జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు తెలిపారు.జగిత్యాల పట్టణానికి చెందిన బీసీ సంక్షేమ సంఘంలో చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో మధురమ్మను ఈ పదవిలో నియమించడం జరిగిందన్నారు.
సంఘం బలోపేతానికి కృషి చేయాలని నాగరాజు సూచించారు ఈ సందర్భంగా మధురమ్మ మాట్లాడుతూ నాపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని బీసీలను మహిళలను సంఘటితపరచి బీసీ హక్కుల సాధనకు పాటుపడతానని అన్నారు. నా నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు, బీసీ మహిళ అధ్యక్షురాలు అంకం పద్మ, ప్రధాన కార్యదర్శురాలు గాజోజు రాధా, బీసీ సంక్షేమ సంఘం మహిళా జిల్లా వర్కింగ్ అధ్యక్షురాలు పొన్నం లావణ్య, కచ్చు లత, శామకూర భాగ్యలక్ష్మి, కల్లెడ మంజుల, జయశ్రీ, పద్మ, సరిత, ఓరుగంటి భార్గవ్ రామ్, పోతంశెట్టి సతీష్ రాజ్, మానాల కిషన్, ఆకుల నాగరాజు, గుగ్గిళ్ళ సత్యనారాయణ, దశరథ రెడ్డి, అశోక్ పాలోజు సత్యం, చంద్రయ్య, సామంతుల ప్రభాకర్, దీటి సతీష్, పులి నరసయ్య, రెడ్డ వేణి సత్యం, భూమి రెడ్డి, లతో పాటు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు