Jagtial NewsTelangana

వార్డు సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు.

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని 35వ వార్డులో పలు సమస్యలతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం 35 వార్డు కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రఘు జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి గూగులోత్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వార్డులో కుక్కలతో చాల ఇబ్బందికరంగా ఉందని, వాటి గురించి మున్సిపల్ కమీషనర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాదారణ సమావేశాలలో కూడ సమస్య పరిష్కరించాలని గత 6 నెలల నుంచి అధికారులతో పాటు చైర్మన్ గారి దృష్టికి తీసుకువస్తున్నా ఇప్పటికి సమస్య పరిష్కరించలేదని అన్నారు. వార్డులోనే కాకుండా జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో కుక్కలతో చాల ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. వచ్చే చలికాలంలో కుక్కలు పిచ్చి పిచ్చిగా వ్యవహరించే అవకాశం ఉందని, అవి ప్రజల పై దాడికి అవకాశం ఉన్న అవకాశాలు కూడా లేకపోలేదని వెంటనే కుక్కల సమస్యకు ఒక పరిష్కారం మార్గం ఆలోచించి వెంటనే చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు జయశ్రీ కోరారు. అలాగే వార్డులో దోమలు కూడ విపరీతంగా ఉన్నాయని, వర్షాకాల ధృష్యా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం లేదని, వార్డులలో ఇంత వరకు ఫాగింగ్ చేయటం లేదన్నారు. ఇంటింటికి దోమల స్ప్రే చేయటం లేదని, రోడ్లమీద ఉన్న గుంతలు పూర్చడం లేదని, బ్లీచింగ్ పౌడర్ చల్లటం గాని చేయటం లేదని అన్నారు. ప్రజలకు కావాల్సిన చిన్న చిన్న సమస్యల పరిష్కారం కూడా చేయలేకపోతున్నారని ఆరోపించారు. వర్షాకాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కమీషనర్ జాయిన్ అయిన వెంటనే దరఖాస్తు సమర్పించిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తమ దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు. వెను వెంటనే అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని హనుమండ్ల జయశ్రీ కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు..