Jagtial CrimeJagtial News

రబియా సైఫీ (సబియా సైఫీ) : హంతకులను అరెస్టు చేసి ఉరి తీయాలి.

జగిత్యాల: రబియా సైఫీ (సబియా సైఫీ) హంతకులను అరెస్టు చేసి ఉరి తీయాలని జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మీర్ ఖాజీమ్ అలీ నేతృత్వంలో ఆదివారం రాత్రి జగిత్యాల టవర్ సర్కిల్ వద్ద క్యాండిల్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ డిఫెన్స్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ రబియా సైఫీ (సబియా సైఫీ) దారుణ హత్య పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హంతకులను ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలి సబీహాను మానవ రూపంలో ఉన్న క్రూర మృగాలు దారుణంగా హత్య చేసారని అన్నారు. వీలైనంత త్వరగా హంతకులను అరెస్టు చేసి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ మహ్మద్ సిరాజుద్దీన్ మన్సూర్, కౌన్సిలర్ ఖవాజా సమీయుద్దీన్ అజార్, రిటైర్డ్ ఇంజనీర్ మహ్మద్ ఘియాసుద్దీన్, మహ్మద్ మసీహుద్దీన్, నహీద్ మహ్మద్, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ బారీ, మహ్మద్ షాబాజ్ మహ్మద్ అకీలుద్దీన్, జావెద్ మహ్మద్ తౌహీద్ అలీ బాసిత్ ఖాన్, హఫీజ్ సల్మాన్ ఫిరోజ్ ఖాన్, మహ్మద్ సమీరుద్దీన్ ఆజాద్, అబ్దుల్లా మొజాజ్ , మహ్మద్ సలీమ్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, షేక్ అహ్మద్ అలీ, బకీర్ ఖాన్, సలీమ్, మీర్ మునవర్ అలీ షలం, హఫీజ్ అస్లాం రష్దీ తదితరులు పాల్గొన్నారు.