మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయడం దారుణం:సర్పంచ్ శోభారాణి
మహిళలపట్ల పోలీసులు వ్యవహరించినతీరు బాధాకరం
భాదిత కుటుంబాలకు సర్పంచ్ శోభారాణి పరామర్శ
జగిత్యాల, ఆగస్టు 26 :
పెద తరగతికి చెందిన మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదాని పెగడపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు, బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి పోలీసులకు సూచించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన పేదల పట్టా భూములను అధికారులు లాక్కొవాలని చూడడమే కాకుండా పోలీసులచే బలవంతంగా అదుపులోకి తీసుకున్న మహిళా రైతు కుటుంబాలను గురువారం శోభారాణి పరామర్శించి ఓదార్చారు.
ఈసందర్బంగా శోభారాణి మాట్లాడుతూ
పెద కుటుంబాలైన నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణి లకు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం భూమి కేటాయించిందని, అప్పటినుంచి వారు సాగుచేసుకుంటున్నారని తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అట్టి భూములకు పట్టాలిచ్చి పసుపుస్తకాలు అందజేషి, ధరణి పోర్టల్ లో నమోదై అభూములకు రైతు బంధు డబ్బులు ప్రభుత్వం ఇస్తుండగా వాటిని తిరిగి అధికారులు లాక్కొవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కొవాలని చూడడం సమంజసం కాదన్నారు. భూములను కాపాడుకునేందుకు 10 రోజులుగా కుటుంబసభ్యులందరు భూమి వద్దే ఉంటుండగావారిని ఎలాగైనా అక్కడినుంచి ఖాళీచేయించాలానే ఉద్దేశంతో పోలీసు బలగలాను దింపి మహిళలని చూడకుండా అందరిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లడం దూర్మార్గమైన చర్యని,అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని శోభారాణి సూచించారు.
పేద కుటుంబాలకు చెందినమహిళలను పోలీసులు ఇడ్చుకుంటూ తీసుకెళ్లడం వారు ఎం తప్పుచేశారాని పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదాని ఆమే హెచ్చరించారు.
శోభారాణి వెంట బుగ్గారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సా గౌడ్, బుగ్గారం మాజీ ఎంపిటిసి రామాగౌడ్ తదితరులున్నారు.