Jagtial NewsLatest

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో
మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందజేత

జగిత్యాల: కరోన ఆపత్కాలంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఇచ్చిన వాటితో పాటు మరో మూడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంద చేయడం జరుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి మదన్ మోహన్ రావు అన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన మదన్ మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు తమవంతుగా సహాయ సహకారాలందించామన్నారు. ప్రధానంగా కరోనా తో ఆక్సిజన్ అందని పరిస్థితులలో రెడ్ క్రాస్ పక్షాన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను అన్ని జిల్లాలకు అందించామని వివరించారు. ఈ సందర్భంలో జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ మదన్ మోహన్ రావుకు స్వాగతం పలుకగా, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆంటోని ముత్తు, టివి సూర్యం, బొడ్ల జగదీష్ , వేణుగోపాల్, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎవిఎల్ఎన్ చారి, ఎన్.రాజు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ కేశవరెడ్డితో పాటుగా నూతనంగా జిల్లా అడ్ హక్ కమిటీ లో సభ్యుడిగా జగిత్యాలకు చెందిన డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి చేరుతూ పాల్గొన్నారు.