జగిత్యాల : ఒక కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ప్రజలకోసం ఉచితంగా వైద్య శిభిరం నిర్వహించి సామాజిక సేవా చేయడం అభినందనియమని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కొనియాడారు. జగిత్యాలలో బుధవారం 43వ వార్డులో మిస్టర్ తెలంగాణ షేహ్వర్ జన్మదినం సందర్భంగా సిగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొనీ పరీక్షలు చేయించుకోగా జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు.ఈ వైద్య శిభిరంలో వార్డు ప్రజలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికీ ఉచితంగా మందులు అందజేశారు.
ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ షేహ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల సిగ్మా ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ,కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పాత్రికేయులు లక్ష్మారెడ్డి, పెండెం మహేందర్, మున్సిపల్ కో .ఆప్షన్ మెంబర్ రియాజ్ మామా, సిగ్మా జగిత్యాల ఆసుపత్రి ఇంచార్జి రాళ్ళబండి శంకర్ ప్రసాద్ రెడ్డి, నాయకులు రవీందర్ రావు, ముఖీమ్, మీరు ఖజిమ్ అలీ, భారీ భాయ్, అజహర్, సిగ్మా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.