Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

జగిత్యాలలో లక్ష 51 వేల ధర పలికిన లడ్డు

జగిత్యాల: జగిత్యాల పద్మనాయక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన వినాయకుని లడ్డు Rs.1,51,000 /- రూపాయల ధర పలికింది. చవితి వేడుకల ముగింపు రోజైనా ఆదివారం మండపం వద్ద ఈ లడ్డును వేలం వేయగా పలువురు దక్కించుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో జగిత్యాల మండలం కల్లెడ కు చెందిన సింగిల్ విండో చైర్మెన్ జోగినిపల్లి సందీప్ రావు – వైష్ణవి లు ఈ లడ్డును దక్కించుకున్నారు. గతంలోను సందీప్ రావు రెండు సార్లు వినాయకుని లడ్డును వేలంలో దక్కించుకున్నారు. వేలంలో వినాయకుని లడ్డు దక్కడం పట్ల సందీప్ రావు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

Exit mobile version