Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

జగిత్యాల జిల్లాలో వాగులో కొట్టుకుపోయి తండ్రి, కొడుకుల మృతి

father-son-died

father-son-died

జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతోపాటు రోడ్లపై వరదనిరుతో రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షాల మూలంగా వరదనీరు వంతెనలపై వెళ్తుండగా వాహనాంపై వాగు దాటుతుండగా వరద ఉధృతికి వాహనం కొట్టుకుపోయి తండ్రి, కొడుకులు మృతి చెందిన సంఘటన గొల్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం నందిపల్లెకు చెందిన గంగామల్లు, విష్ణులు మల్లన్నపేటకు ద్వి చక్ర వాహనాంపై వెళ్తుండగా అక్కడి వాగు నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నది. రోడ్డు దాటెందుకు సాహాసించిన గంగమల్లు బైక్ వరదలో కొట్టుకుపోయి తండ్రి, కొడుకులు ఇద్దరు గళ్ళంతయారు.
ఈవిషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరికోసం గాలించంగా తోలుతా కొడుకు విష్ణు, తదుపరి తండ్రి మృతదేహాలు లభించడంతో కుటుంసభ్యుల రోధనాలు మిన్నంటాయి. కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడడంతో కుటుంబంలో విషాదచాయాలు అలుముకున్నాయి.
జిల్లా కలెక్టర్ రవి సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Exit mobile version