Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను (స్కావెంజర్స్ ని) నియమించాలి… తపస్.

జగిత్యాల: సెప్టెంబర్ 1 నుండి రాష్ట్రంలో పాఠశాలలు పున ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను (స్కావెంజర్స్) నియమించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జి రవి కి సంఘ నాయకులు ఒక వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా తపస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో మాదిరిగానే పారిశుద్ధ్య కార్మికులను పాఠశాలల్లో నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్థానిక సంస్థలకు పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహించే బాధ్యతను అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అక్కడ పూర్తిస్థాయి సిబ్బంది కొరత వల్ల ప్రతిరోజు పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు, మొదట్లో ఒకటి రెండు రోజులు కార్మికులు వచ్చినప్పటికీ రెగ్యులర్గా పాఠశాలలకు కు స్థానిక సంస్థలు కార్మికులను పంపించడం అంత సులువు కాదన్నారు, నిత్యం పాఠశాలల్లోని నీటి ట్యాంకులు టాయిలెట్స్, నీటి కొళాయిలు.. నీటి సంపులు, వాటి నిర్వహణ పూర్తిస్థాయిలో పారిశుధ్య కార్మికులు చేయడం సాధ్యం కాదని ఇది నిత్యం జరిగే ప్రక్రియ కావున గతంలో మాదిరిగానే పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు స్కావెంజర్స్ ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, బోనగిరి దేవయ్య రాష్ట్ర బాధ్యులు రాజేంద్రప్రసాద్, జిల్లా సహాధ్యక్షుడు ప్రసాదరావు ఉన్నారు.

Exit mobile version