ఎస్సి స్టడి సర్కిల్ భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల: జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న ఎస్సి స్టడిసర్కిల్ కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రవి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తులసీనగర్, రైల్వేస్టెషన్ రోడ్డు, స్వాగత్ కన్వేన్షలో ఎర్పాటు చేయనున్న స్టడి సర్కిల్ కేంద్రాన్ని పరిశీలించారు. పూర్వ కరీంనగర్ జిల్లా అనంతరం, మొదటగా జగిత్యాల జిల్లాలో సివిల్స్, గ్రూప్ 1, 2 మొదలగు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటి లకు చెందిన విద్యార్థుల కొరకు ఏర్పాటు చేయనున్న స్టడిసర్కిల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకూల వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. ఈ స్టడి సర్కిల్ ద్వారా ప్రాథమిక పరీక్షద్వారా ఎంపికైన 100 మంది విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణను అందించడం జరుగుతుందని, నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే రాష్ట్ర మంత్రి గారి అమోదం మేరకు స్టడి సర్కిల్ ను ప్రారంబిస్తామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యుల్ కులాల అభివృద్ది అధికారి రాజ్ కుమార్ ఉన్నారు.