బ్రిడ్జీలు, ఒర్రె లను దాటేప్పుడు జాగ్రత్త వహించాలి :కలెక్టర్ రవి
జగిత్యాల, సెప్టెంబర్ 7: వర్షాల కారణంగా లోలెవల్ బ్రిడ్జిలు, సహజ ఒర్రెలను దాటే క్రమంలో ప్రజలు జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి పేర్కోన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం మల్లన్న పేట గ్రామం (తిర్మలాపూర్ యం) వద్ద వెంగళాపూర్ – మల్లన్నపేట గ్రామాల మద్య రాకపోకలకు ఉపయోగించే దారిలో కుడుకల గంగమల్లు (47) అతని కుమారుడు కుడుకల హర్షవర్దన్ (07) లు వ్యక్తిగత పనులపై మల్లనపేట గ్రామం నుండి తిరిగి వస్తున్న క్రమంలో వరదనీటితో ప్రవహిస్తున్న సహజ ఒర్రెలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో పాటుగా పడి కొట్టుకుపోయి మరణించగా, మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రమాదానికి గురై ఒర్రె ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం మృతుని ఇంటికి వెళ్లి అతని బందువులను పరామర్షించారు. లోతట్టు ప్రాంతం కాకపోయి నప్పటకి, ఉదృత్తంగా ప్రవహిస్తున్న వరదనీటి కారణంగా మట్టికుంగిపోయి ప్రమాదవశాత్తు ఒర్రెలో ద్వీచక్రవాహనంతో పాటుగా పడి కోట్టుకుపోయి మరణించడం చాలా దురదృష్టకరమని, వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహరాలను కూడా అందించడం జరగుతుందని తెలియజేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని , అవసరమైతె తప్ప బయటకురాకూడదని, లోలెవల్ బ్రీడ్జిలవద్ద బారికేడిoగ్ ఎర్పాటుచేసి, పోలిస్, రెవెన్యూ పంచాయితి, మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటుచేసి అటువైపు ప్రయాణాలు గాని, చేపల వేటకు వేళ్లకుండ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం జగిత్యాల నుండి గొల్లపెల్లి మార్గమద్యంలో రోడ్డుపై ప్రవహిస్తున్న మోతే కాలువ, జగిత్యాల సారంగపూర్ మార్గమద్యలోని కోనాపూర్ వాగు ఎల్లమ్మ దేవాలం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించి వరద ఉదృతి తగ్గే వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేయలని ఆధికారులను అదేశించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డిఓ దుర్గ మాదురి, జగిత్యాల డిఎస్పి ప్రకాశ్, గొల్లపెల్లి తహసీల్దార్ నవీన్ పంచాయితి అధికారులు పాల్గోన్నారు.