తెలంగాణ ఉద్యమ పోరాటంకు ఐలమ్మ స్పూర్తి: జడ్పీ చైర్పర్సన్,ఎమ్మెల్యే
జగిత్యాల: తెలంగాణ ఉద్యమ పోరాటంకు ఐలమ్మ స్పూర్తి అని జగిత్యాల జడ్పి చైర్ పర్సన్ దావా వసంత సురేష్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ తో కలిసి వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వెనకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనిత ఐలమ్మదని, తెలంగాణ ఉద్యమ పోరాటం ఐలమ్మ స్పూర్తితో జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో పివి గారికి తగిన గుర్తింపు దక్కలేదని తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహ రావు శత జయంతి ఉత్సవాలను జరుపుకున్నామని, తెలంగాన మహానుభావులను గౌరవించుకుంటున్నామని అన్నారు. కుల,మత భేదం లేకుండా అన్ని కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని,
మహిళలందరికి స్ఫూర్తినిచ్చింది, మహిళలకు గర్వకారణము చాకలి ఐలమ్మ అని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ మాట్లాడుతూ ఐలమ్మ రజాకార్ల, దొరలతో పాలనకు వ్యతిరేకంగా కొట్లాడి పోరాటంచేసిన ఘనత ఐలమ్మదని, వారిని స్మరించుకుంటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారికంగా నేడు జయంతిని జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలో రజకులు ఉండే ప్రదేశంలో చింత కుంట ను మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేశామని, కట్ట వెడల్పు పెంచామని, కట్ట పక్కన చెట్లు నాటామని పచ్చదనం పెంచామని, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని, చింతకుంట స్మశానవాటికను అభివృద్ధి చేసుకున్నామని, 2014 న ఓడిపోయిన తర్వాత ఇంచార్జ్ గా ఉండి ఐలమ్మ విగ్రహానికి, మడేలమ్మ ఆలయ అభివృద్ధి కి కవితక్క సహకారంతో కృషి చేశానని, కరోనా వల్ల కొంత అభివృద్ధి ఆలస్యం అయిందని పార్క్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని త్వరలోనే పనులను ప్రారంభిస్తామని ఇలా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నామని, కూరగాయ మార్కెట్,డివైడర్లు, పైప్ లైన్ మరమత్తుల దృష్ట్యా కొంత రహదారి ఇబందులు ఉన్నాయని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మిషన్ భగీరత పనులు నడుస్తున్నాయని ప్రజలు సహకరించాలన్నారు. రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,మీటర్లు అందించిన ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు, జగిత్యాలలో 450 నుండి 1000 పైగా రజకులకు లబ్ధిచేకూరిందని అన్నారు. ఎలాంటి నిబంధనలు,ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఇది అమలవుతుందని, సంఘ పెద్దలు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణశ్రీ ,స్థానిక కౌన్సిలర్ బాలే లత శంకర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా, బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు గిరి, రజక సంఘ జిల్లా అధ్యక్షుడు నారాయణ, మండల అధ్యక్షుడు పోచాలు, ప్రజాప్రతినిధులు నాయకులు రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.