Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

జగిత్యాలలో కొనసాగుతున్న భారత్ బంద్

bharat-bandh-in-jagtial-

bharat-bandh-in-jagtial-

జగిత్యాల: కాంగ్రెస్, వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా సోమవారం ఇచ్చిన భారత్ బంద్ జగిత్యాలలో పాక్షికంగా కొనసాగుతుంది. జిల్లాలో భారత్ బంద్ సక్సెస్ కోసం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు వాణిజ్య కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి బంద్ కు సహరించాలని కోరారు. జగిత్యాల పట్టణంలోని ఆర్టీసి డిపో ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా, పోలీసుల ముందుస్టు అరెస్టు చర్యల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అంతకుముందు పార్టీల నాయకులు, కార్యకర్తలు వాహనాలపై తిరిగి దుకాణాలను మూసివేయాలని సూచించారు. భారత్ బంద్ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వ్యాపార వ్యాపార వాణిజ్య కూడళ్లు అయిన రాం బజార్, యావర్ రోడ్డు, మోచి బజార్ లో వ్యాపారులు దుకాణాలను పాక్షికంగా మూసి భారత్ బంద్ పాల్గొంటున్నారు. వారితో పాటూ రైతు ఆధారిత సంస్థల నిర్వాహకులు తమ దుకాణాలను మూసివేసి భారత్ బంద్ లో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుతంగా తాము బంద్ కు సహరించాలని కోరుతుండగా, అప్రజాస్వామికంగా తమను అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు,

Exit mobile version