ప్రతి బిసి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి:బీసీ సంక్షేమ సంఘం
జగిత్యాల: బిసి బంధు ఏర్పాటు చేసి ప్రతి బిసి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మి నారాయణ అన్నారు. బీసీల సమర శంఖారావంలో భాగంగ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా, బుధవారం జగిత్యాలలో నాయకులు ఆర్డీవో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా ఇవ్వని బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 2లక్షల 50 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, రెండు సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్నారు. తొలగించిన 7861 గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి చేర్చుకోవడంతో పాటు సమస్యల పై బీసీల సమస్యలపై జగిత్యాల ఆర్డీవో ముట్టడి చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, జిల్లా కన్వీనర్ జీకూరి శ్రీహరి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజాల రమేష్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమల్ల సంజయ్ సామ్రాట్, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపురం రాంచందర్, రాష్ట్ర యూత్ కో-ఆర్డినేటర్ హ్రుషికేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలుసాని తిరుమల్ గౌడ్, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు మాచర్ల తిరుపతి, బిసి సేన జిల్లా కన్వీనర్ శ్యామల మధుకర్, సారంగాపూర్ ఇంచార్జీ తిరుపతి తదితరులు ఉన్నారు.