Jagtial NewsJagtial Politics

బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ కోసం ఆలయంలో పూజలు

జగిత్యాల: హైదరాబాద్ చార్మినార్ వద్ద గల భాగ్యలక్మి టెంపుల్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర నేడు ప్రారంభం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పాదయాత్ర కు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా ముందుకు సాగాలని జగిత్యాలలోని ప్రముఖ మార్కండేయ దేవస్థానంలో గాయత్రీ మాత అమ్మవారి వద్ద బీజేపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు, నిర్మల్ జిల్లా ఇంచార్జి మ్యాన మహేష్ మాట్లాడుతూ శనివారం బండి సంజయ్ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఇంచార్జి శ్రీ తరుణ్ ఛుగ్ ప్రారంభించిన అనంతరం హైదరాబాద్ నగరంలో కొనసాగుతుందన్నారు. మొదటి విడత పాదయాత్ర 36 రోజుల పాటు ఉంటుందని, అక్టోబర్ 2న పాదయాత్ర హుజురాబాద్ లో ముగుస్తుందని, ముగింపు సభలో అమిత్ షా పాల్గొననున్ననట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, మేధావులు, నిరుద్యోగ యువకులు సకలజనుల ఏకం అవుతున్నారని, తెలంగాణ రాష్ట్ర స్వావలంబన దిశగా కదులుతూ ఈ పాదయాత్రలో భాగం పంచుకోవాలని సిద్ధం అవుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జీ ప్రవేశ పెట్టిన పధకాలు ప్రతి ఇంటికి వెల్లి ప్రచారం చేస్తామన్నారు. ఈ పూజ కార్యక్రమంలో విజయ్, జ్ఞానేశ్వర్ గట్ల వెంకటేష్ , కృష్ణ , కొత్తూరి శ్రీనివాస్, సంతోష్ , నవీన్, చింటూ, భూమేష్ , సాయి వరుణ్ నిక్కీ తదితరులు పాల్గొన్నారు.