మాజీ సర్పంచి, తెరాస నాయకుడి ఇంటిపై దాడి
జగిత్యాల: పట్టణంలోని టి ఆర్ నగర్ కు చెందిన మాజీ సర్పంచి, తెరాస నాయకులు కొండ శ్రీను ఇంటిపై అదే గ్రామానికి చెందిన సమీప బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శ్రీను కొడుకు నాగేందర్ కు బలమైన గాయాలయ్యాయి. గాయపడిన నాగేందర్ ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏడుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారు మాజీ సర్పంచ్ శ్రీను కు సమీప బంధువులని తెలిసింది. శ్రీను కుటుంబ సభ్యులకు, దాడికి పాల్పడిన వారికి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని పోలీసుల ద్వారా తెలిసింది.