జగిత్యాల: పట్టణ ఎన్సీఎల్పీ అంగన్ వాడి కేంద్రంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు సీమాంతలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ స్వప్న మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోతే రక్తహీనత వస్తుందని, గర్భిణులు బిడ్డ పుట్టిన రెండేండ్ల వరకు బిడ్డకు తల్లి పాలు తాగించాలన్నారు. ముర్రుపాల విశిష్టత ను వివరించారు.
ఈ పోషణ మాసోత్సవాల్లో భాగంగా తల్లులు, పిల్లల పర్యవేక్షణ గురించి అవగాహన కల్పిస్తారని, కేంద్రాల్లో పిల్లలకు సంబంధించి ఎత్తు, బరువు కొలతలు చూడటం జరుగుతుందని అంగన్ వాడి టీచర్లు తెలిపారు. అంతేకాకుండా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం గురించి తల్లులకు తెలియచేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకుని పిల్లల ఎదుగుదలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రిజ్వానా బేగం, షాహిన సుల్తానా, జె. తిరుమల దేవి, గర్భిణులు
ఆయాలు తదితరులు పాల్గొన్నారు.