జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎల్ వి ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు హీరోయిన్ అను ఇమ్మానియేల్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అను ఇమ్మనియేల్ వినియోగదారుల తో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ లో తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు మెచ్చే అన్ని రకాలు వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జ్యోతి ప్రజ్వలన గావించగా ఇంకా ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి తదితరులతో పాటు ఎల్ వి ఆర్ షాపింగ్ మాల్ సంస్థ నిర్వాహకులు హాజరయ్యారు. కాగా సినీ నటి అను ఇమ్మనియేల్ తో మహిళలు సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు.