హీరో శ్రీకాంత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు నరేష్
హీరో శ్రీకాంత్ కు వార్నింగ్ ఇచ్చాడు సీనియర్ నటుడు నరేష్. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన సందర్బంగా నేను ఇచ్చిన బైట్ ని కార్నర్ చేస్తూ నాపై బైట్ ఇచ్చావు. ఇలాంటి బైట్ లు ఇచ్చేప్పుడు కాస్త చూసుకొని చెప్పమ్మా ! నా ముందు హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నావు , నేను 50 ఏళ్లుగా ఈ సినిమారంగంలో ఉన్నాను. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. సాయి గురించి ఇచ్చిన బైట్ మీడియాలో మరోరకంగా రావడంతో వెంటనే నేను మరో బైట్ మీడియాకు విడుదల చేశాను. దానిపై నువ్వు నాకు సలహా ఇచ్చేంత గొప్పవాడివా ? అన్నట్లుగా శ్రీకాంత్ ని హెచ్చరించే రీతిలో తాజా బైట్ ఇచ్చాడు సీనియర్ నటుడు నరేష్.
నిజానికి నరేష్ చెప్పింది మంచి విషయాలే కానీ సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి లోనైన సందర్భంలో ఇలాంటి మాటలు అవసరమా ? అంటూ నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు కొంతమంది.