దోమలమందు స్ప్రే చేసిన సర్పంచ్ శోభారాణి
గ్రామభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతా
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత
దోమలమందు స్ప్రే చేసిన సర్పంచ్ శోభారాణి
జగిత్యాల, ఆగస్టు 23:
గ్రామాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి చెప్పారు.
వర్షాలు కురవడంతో గ్రామాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా బతికేపల్లిలోనీ అన్ని విధుల్లో సర్పంచ్,ఆదేశాల మేరకు పంచాయితీ సిబ్బంది దోమల మందు స్ప్రే చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బందికి మందు స్ప్రే చేయడానికి కొత్తగా మరో రెండు డబ్బాలు కొనుగోలుచేసి వారికీ అందజేశారు.
నేను సైతం సిబ్బందికి అండ అంటూ మందు డబ్బాను భుజానవేసుకొన్న సర్పంచ్ శోభారాణి గ్రామంలోని 3వ వార్డులో దోమల మందు స్ప్రే చేసీ శభాష్ అనిపించుకున్నారు.
ఈసందర్బంగా శోభారాణి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
వర్షాల మూలంగా గుంతలు, మురుగుకాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీ సిబ్బందితో అన్ని విధులు, డ్రైనేజి, గుంతల్లో మందు పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు.
పంచాయతీ పక్షాన
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని,
గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
సిబ్బందితో విధులన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తు, మురుగుకాలువల్లో సిల్ట్ తీయిస్తూ, కుండీల్లో వేసిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యర్దుకు చేరవేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని శోభారాణి అన్నారు.
హరితహారంలో భాగంగా రైడ్లకిరువైపులా చెట్లను నాటించడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తూ గ్రామంలో పచ్చధనo వెల్లివిరిసేలా చేశామని చెప్పారు.