విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
జగిత్యాల: సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సియం కేసీఆర్ ను కోరారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కు ఒక వినతిపత్రం అంద చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ అధ్యక్షుడు వీర బత్తిని అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాల నుండి రజాకార్ల వారసులైన ఎంఐఎం పార్టీకి భయపడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని, ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు, జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనుమల కృష్ణ హరి, జిల్లా అధికార ప్రతినిధిలు భూమి రమణ, మరిపెళ్లి సత్యం ,పట్టణ ఉపాధ్యక్షులు సిరికొండ రాజన్న, మాడిశెట్టి మల్లేశం, పవన్ సింగ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ముద్దం రాము, యువ మోర్చా అధ్యక్షుడు కొండ్ర రవి తేజ, నాయకులు పులి శ్రీధర్, సరిగెల రాజలింగం, సుద్దాల విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.