Jagtial NewsLatest

జగిత్యాల గోదావరి అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సత్కారం

జగిత్యాల : పట్టణంలోని గోదావరి అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు.జగిత్యాల శాఖ క్లస్టర్ బిజినెస్ మేనేజర్ పి.రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా… ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం బ్యాంకు ఆవరణలో ఆరుగురు ఉపాధ్యాయులు ఎన్నం రాంరెడ్డి, శ్రీమతి మేన్నేని నీలిమ, రామగిరి రమ్య, వూటూరి రాజు, రంగు వేణు, ఒద్దినేని శరత్ చందర్ రావు లను సన్మానించి, ప్రశంసాపత్రములనందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నిత్యం ఆర్థిక లావాదేవీలతో సతమతమయ్యే బ్యాంక్ అధికారులు వారి యాజమాన్యం సూచనలతో ఉపాధ్యాయులను సన్మానించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయమనీ…సమాజంలో ప్రతి వ్యక్తి ఎదుగుదలలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు. ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ అధికారులు, సిబ్బంది తో పాటు యాజమాన్యంకు అభినందనలు తెలిపారు.