వల్గర్ డ్యాన్స్ ఇష్టపడే చేస: ఇనయా సుల్తానా
ఇటీవల సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన వీడియో రాంగోపాల్ వర్మ – ఇనయా సుల్తానా ల డ్యాన్స్ వీడీయో. ఆ వీడియోలో దర్శకుడు రాంగోపాల్ వర్మ అసభ్యకరమైన రీతిలో ఇనయా సుల్తానా పై చేతులు వేసి కసిగా చేసిన డ్యాన్స్ వీక్షకులను చిరాకు తెప్పించింది దాంతో పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. అయితే ఈ విమర్శలు మరీ ఎక్కువ కావడంతో వర్మతో ఆ వల్గర్ డ్యాన్స్ నేను ఇష్టపడే చేశాను అంటూ తాజాగా ఓ వీడీయో పోస్ట్ చేసింది ఇనయా సుల్తానా.
సినిమాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. వస్తున్న ఒకటి అరా సినిమాల వల్ల లాభం లేదనుకొని ఇలా వర్మ సహాయం పొందుతోంది. వర్మ తో ఇలా డ్యాన్స్ చేస్తే చాలు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోవచ్చని ధీమా కావచ్చు. మొత్తానికి ఈ భామ అనుకున్నది నెరవేరింది…… ఇనయా సుల్తానా అంటే నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు సెలబ్రిటీ అయిపొయింది వర్మతో వల్గర్ డ్యాన్స్ చేసి.
రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సినిమాలో ఈ భామకు ఛాన్స్ ఇచ్చాడట. దాంతో ఖుషీ అయిపోతోంది ఇనయా సుల్తానా. అంతేకాదు వర్మ ఒత్తిడితో కాదు నా ఇష్టపూర్వకంగానే డ్యాన్స్ చేశాను అన్నట్లుగా వీడియో పోస్ట్ చేసింది. మొత్తానికి అందమైన భామల పొందు కోసం పరితపించే వర్మ చిలక్కొట్టుడు కొడుతున్నాడు.