మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణిచే భాలామృతం పంపిణి
ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల పునఃప్రారంభం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని అంగన్వాడీ పాఠశాలలో మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ భాలామృతం పంపిణి చేశారు.బుధవారం జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులోనీ అంగన్వాడీ స్కూల్ ను శ్రావణి సందర్శించి గర్భిణీలు, బాలింతలకు, పిల్లలకు గుడ్లు, పాలు బాలామృతం, పలహారాలు పంపిణీ చేశారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నిర్వాహకులు స్వప్న, సౌజన్య, మహిళలు, పిల్లలున్నారు.