బదిలీ పై వెళుతున్న డీఎస్పీ ని సన్మానించిన: జిల్లా ఎస్పీ
జగిత్యాల: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీలలో భాగంగా హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ కు బదిలీ పై వెళుతున్న డీఎస్పీ వెంకటరమణ ని శనివారం జిల్లా ఎస్పీ సింధు శర్మ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు పోలిస్ అధికారులు డీఎస్పీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోన ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వంటి విపత్కర పరిస్థితుల్లో క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. అనంతరం డీఎస్పీ వెంకటరమణ గారు మాట్లాడుతూ… జిల్లా లో సుమారు రెండు సంవత్సరాల పాటు నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని, క్రింది స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిది అని, ముఖ్యంగా కోవిడ్-19 కోవిడ్ నియంత్రణలో పోలీస్ శాఖ వారికి జిల్లా ప్రజలు అందించిన సహకారం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ గౌస్ బాబా, ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ఇన్స్పెక్టర్ కిషోర్,సి.ఐ లు కృష్ణకుమార్, రమణమూర్తి, కోటేశ్వరరావు, శ్రీను, ఆర్ ఐ లు వామమూర్తి, నవీన్, సైదులు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్ పాల్గొన్నారు.