పంచాయతీ కార్యదర్శి ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు
జగిత్యాల: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో ఫిర్యాదుతో విచారణ అధికారి చేత విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఎస్.ఆర్.ఎస్.పి. ప్రభుత్వ భూమిని ఇతరులకు ప్రభుత్వ భూమి కాదని రికార్డులు చూపారని, గ్రామ పంచాయతీ జాబితాపూర్ లో రూ.1,70,000 నిధులకు పంచాయతీ కార్యదర్శి సరైన రికార్డులు నిర్వహించన్నట్లుగా గమనించడం జరిగిందని అన్నారు.
చెల్లింపులకి సంబంధించిన రికార్డులు లేవని, రికార్డు నిర్వహణ లోపంను పరిశీలించడం ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ తన విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తెలిసిందని అన్నారు. ప్రభుత్వ నియమాలను అనుసరించి, సీసీఎ నియమ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న చంద్రశేకర్ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.