కుక్కల బెడద నుండి కాపాడండి
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఐదో వార్డులో కుక్కల బెడద తీవ్రంగా ఉందని వాటి నుండి కాపాడాలని కోరుతూ ఆ కాలనీకి చెందిన ప్రజలు అధికారులను కోరుతున్నారు. రాత్రివేళ కుక్కలు వచ్చి వచ్చి పోయే వారి వెంట పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. అంతేకాకుండా వాహనాలపై వెళ్తున్నప్పుడు కుక్కలు వాహనాల వెంట పడుతున్నాయని వారు ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద వల్ల పిల్లలు, మహిళలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నివారించాలని ఆ కాలానికి చెందిన పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.