Site icon Jagtial Latest News & Updates – Mana Jagtial-మన జగిత్యాల

సెప్టెంబర్ 10 న మూడు సినిమాలు పోటీ

movie 2 movies-sep3rd

movie 2 movies-sep3rd

సెప్టెంబర్ 10 న అంచనాలున్న మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ మూడు సినిమాల్లో నాని నటించిన టక్ జగదీష్ చిత్రం మాత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా కంగనా రనౌత్ నటించిన తలైవి , గోపీచంద్ – తమన్నా జంటగా నటించిన సీటీ మార్ చిత్రాలు మాత్రం నేరుగా థియేటర్ లలో విడుదల అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలపై కూడా మంచి అంచనాలున్నాయి. కంగనా నటించిన తలైవి పక్కాగా హిట్ అని తేలిపోయింది. అయితే థియేటర్ లకు పెద్ద ఎత్తున జనాలు వస్తారా ? లేదా ? అన్న చిన్న అనుమానం అయితే ఉంది.
ఆ సినిమాని పక్కన పెడితే గోపీచంద్ – తమన్నా జంటగా నటించిన సీటీ మార్ పక్కా కమర్షియల్ చిత్రం అందునా సందేశాత్మక చిత్రం కూడా. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ముఖ్యంగా బీసీ కేంద్రాల్లో ఆదరణ ఎక్కువగా లభించడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్ ల వరకు చూస్తే పోటీ తలైవి – సీటీ మార్ చిత్రాల మధ్యనే అని చెప్పాలి. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో ? ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.
ఇక నాని నటించిన టక్ జగదీష్ కూడా ఓటీటీ లో సక్సెస్ అయిందా ? లేదా ? అనే లెక్కలు వస్తాయి కాబట్టి అతడికి కూడా పరీక్షే అని చెప్పాలి. థియేటర్ లను కాదని , అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూడు కూడా వినాయక చవితి పండగ సందర్బంగా విడుదల అవుతున్నాయి. మరి ఈ మూడు చిత్రాల్లో ఏది నెంబర్ వన్ గా నిలుస్తుందో చూడాలి. 

Exit mobile version