జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
జగిత్యాల: హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై హత్యాచారం కేసు మరువకముందే మరో బాలికపై ఓ 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలిక ఇంటి పక్కనే ఉండే సమీప బంధువు రోజు టీవీ చూడటానికి ఇంటికి వచ్చే సుమంత్ అనే 19 ఏళ్ల యువకుడు, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఐదేళ్ల పాపపై నిన్న సాయంత్రం అత్యాచారయత్నం చేయగా ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు కరీంనగర్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు .
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై 371, 448, 376, 66 సెక్షన్ లతో పాటు సెక్షన్ 6 ప్రకారం పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నిందితుడు సుమంత్ (19)ని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం పాపకు కొంత జ్వరం వచ్చినట్టుగా.. బలహీనంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా యువకుడి అత్యాచారయత్నం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అన్ని ఆధారాలను సేకరించి యువకుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేస్తామని ఎస్ పి సింధు శర్మ తెలిపారు.